నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘కస్టడీ’. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఇవ్వాళ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చైతూ చెప్పిన విశేషాలు.
- ‘మానాడు’ సినిమా కంటే ముందే వెంకట్ ప్రభు నాకు ఈ కథ చెప్పారు. వినగానే చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. ఈ కథ పరంగా కొంతమంది పోలీసు కానిస్టేబుళ్లను పర్సనల్‌గా కూడా కలిశాను. వారి కష్టాలు విన్నాక ఇన్‌స్పైరింగ్‌గా అనిపించి.. కచ్చితంగా ఇలాంటి కథ ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను.
- కానిస్టేబుల్ శివ పాత్రలో కనిపిస్తా. ఫస్టాఫ్‌లో నా క్యారెక్టర్ ఎంజాయ్ చేసేలా వుంటుంది. సెకండాఫ్‌లో కానిస్టేబుల్‌గా గ్రోత్ మారుతూ వుంటుంది. ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది కూడా. పాత్రపరంగా వెంకట్‌ప్రభు చెప్పింది చెప్పినట్లు తీశారు. తెలుగుతోపాటు తమిళంలోనూ నేనే డబ్బింగ్ చెప్పాను.
- ఇందులో యాక్షన్ పార్ట్ చాలా కీలకం. ఆ సీన్స్ చాలా నేచురల్‌గా ఉంటాయి. గాల్లోకి ఎగిరే సన్నివేశాలు, అండర్ వాటర్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి. నేను ఏ సినిమాలో చేయని యాక్షన్ సీన్స్ ఇందులో చేశాను. అందుకే ప్రొడక్షన్ పరంగా హయ్యస్ట్ సినిమా అవుతుంది.
- కృతిశెట్టి ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండించింది. నటిగా తను చాలా మెచ్యూర్డ్. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి లాంటి సీనియర్స్‌తో నటించడంతో వాళ్ల దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా 1990 బ్యాక్ డ్రాప్‌లో జరుగుతుంది. అందుకే ఆ కాలానికి తగ్గట్టు వింటేజ్ మ్యూజిక్ ఉండాలని ఇళయరాజా గారిని తీసుకున్నాం. యువన్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్.
- రీసెంట్‌గా ఫైనల్ అవుట్‌పుట్ చూశాను. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని నమ్ముతున్నా. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వబోతున్నామనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక నేను చేసే ప్రతి సినిమా ఛాలెంజ్‌గా తీసుకుంటాను. ప్రతిరోజూ కష్టపడి పని చేస్తుంటాను. తాత గారు, నాన్న గారిలా నేను, అఖిల్ కూడా సొంత స్టైల్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీని తర్వాత పూర్తి భిన్నమైన సినిమా చేయబోతున్నా. తెలుగు, తమిళ ప్రేక్షకులే నా టార్గెట్. అందుకే పాన్ ఇండియా వైపు వెళ్లడం లేదు.