
నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇటీవల టాకీ పార్ట్ పూర్తి చేసిన టీమ్.. సాంగ్ షూట్‌లో బిజీగా ఉంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏడు రకాల భారీ సెట్స్‌ను నిర్మించారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్ డి.వై.సత్యనారాయణ కలిసి ఈ సెట్స్‌ని డిజైన్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈ డ్యాన్స్ నంబర్ బిగ్ స్క్రీన్‌పై విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతుందని చెబుతున్నారు మేకర్స్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు. ప్రియమణి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తున్నారు. మే 12న సినిమా విడుదల కానుంది.