నాగ చైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ (Thandel). ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం హీరో నాగ చైతన్య, సాయి పల్లవి తమ పారితోషికాన్ని అమాంతం పెంచినట్లు సమాచారం. ఎవరు ఎంత తీసుకున్నారో వివరాల్లో చూద్దాం.
నాగ చైతన్య vs సాయి పల్లవి రెమ్యునరేషన్:
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తండేల్ మూవీ కోసం నాగ చైతన్య రూ.15 నుండి 20 కోట్ల మధ్య పారితోషికం తీసుకున్నారట. తండేల్ కంటే ముందు ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే, చైతన్య మునుపటి కంటే రూ.10 కోట్ల మేరకు పారితోషికాన్ని గణనీయంగా పెంచేశాడు.
అయితే, తండేల్ మూవీ కోసం సాయి పల్లవి కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుందంట. అమరన్ సినిమా కోసం రూ.3 కోట్ల వరకు తీసుకున్న సాయి పల్లవి.. తండేల్ కోసం ఏకంగా రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిందట. కానీ, సాయి పల్లవి పారితోషికం నాగ చైతన్యతో పోలిస్తే చాలా తక్కువ.
ఎందుకంటే, సాయిపల్లవి కంటే నాగ చైతన్య నాలుగు రెట్లు ఎక్కువే అందుకున్నాడు. అయితే, ఓ ఫిమేల్ లీడ్కు ఇది మంచి మొత్తమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు సినిమాలో హీరోయిన్స్కి ఇంత మొత్తంలో అంటే ఇదే హయ్యెస్ట్.
Also Read :- బాబాయ్, అబ్బాయ్ వార్ మరింత ముదిరింది
అయితే, సాయి పల్లవికి ఉన్న క్రేజీ దృష్ట్యా ఈ మాత్రం చెల్లించడం తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే, ఆమెకు ఉన్న భారీ ప్రేక్షకాదరణ అలాంటిది. థియేటర్‌లకు తీసుకురాగల సామర్థ్యాన్ని సాయి పల్లవికి ఉంది. చాలా మంది హీరోయిన్స్ల మాదిరిగా (కమర్షియల్ సక్సెస్) కాకుండా, ఆమె కేవలం బలమైన పాత్రల ఆధారంగా సినిమాలను ఎంచుకుంటుంది కనుక.
తండేల్ బడ్జెట్:
'తండేల్' సినిమా దాదాపు రూ. 80-90 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారని టాక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు రూ.100 కోట్ల మార్కును దాటాలి. తండేల్ సినిమాకు ఫస్ట్ డే టాక్ మంచిగా ఉంటే.. ఓపెనింగ్ కలెక్షన్లు అదిరిపోయే ఛాన్స్ ఉంది.
తండేల్ కథ:
2018లో శ్రీకాకుళానికి చెందిన మత్య్సకారులు గుజరాత్‍లో చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్థాన్ హద్దులకు వెళ్లారు. అక్కడ పాక్ సైన్యానికి పట్టుబడ్డారు. పాక్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించారు. ఆ తర్వాత మళ్లీ భారత్‍కు చేరారు. వారిలో మత్స్యకారుడు రాజు కూడా ఒకరు. అతడి నిజ జీవిత కథ ఆధారంగానే తండేల్ చిత్రం రూపొందింది. ఈ కథ వెనుక ఉన్న నిజ జీవిత ప్రేరణ ప్రేక్షకులతో గాఢంగా ప్రతిధ్వనిస్తుందని ట్రేడర్స్ భావిస్తున్నారు.