Thandel Box Office: అఫీషియల్.. తండేల్ 2 డేస్ కలెక్షన్స్ ఇవే.. నాగ చైతన్య కెరీర్‌లోనే హయ్యెస్ట్

Thandel Box Office: అఫీషియల్.. తండేల్ 2 డేస్ కలెక్షన్స్ ఇవే.. నాగ చైతన్య కెరీర్‌లోనే హయ్యెస్ట్

నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్(Thandel)  మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన తండేల్ మూవీ 2 రోజుల్లో రూ.41.20కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా మేకర్స్ (ఫిబ్రవరి 9న) అధికారిక పోస్టర్ రిలీజ్ చేసి కలెక్షన్స్ వెల్లడించారు. తండేల్కు ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.21.27కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

సాక్నిల్క్ ప్రకారం:

తండేల్ మూవీ మొదటి రోజు రూ.11.5 కోట్లు నెట్ వసూళ్లు చేసింది. రెండవ రోజు రూ.12.64 కోట్లు వసూలు చేసి మొత్తం రెండ్రోజుల్లో రూ.24.14 కోట్లు వసూలు చేసి దూసుకెళ్తోంది. 

ఇక తండేల్ మూవీ ఫస్ట్ డే తెలుగులో రూ.11.3 కోట్లు, హిందీలో రూ.12 లక్షలు, తమిళంలో రూ.8 లక్షలు వసూలు చేసింది. దీంతో శుక్రవారం (ఫిబ్రవరి 7న) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.21.27 కోట్లు వసూలు చేసింది. ఇది నాగ చైతన్య కెరీర్‌లో అత్యుత్తమ ఓపెనింగ్‌గా నిలిచింది.

2021లో విడుదలైన లవ్ స్టోరీ సినిమాను అధిగమించింది. లవ్ స్టోరీ మూవీ ఫస్ట్ డే దాదాపు రూ.10.50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్‌లో అత్యధిక ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌ను సొంతం చేసుకుంది.