Thandel: శివ-పార్వతులకు చై, సాయి పల్లవి సంగీత విందు..మ్యూజికల్ ట్రీట్కు సిద్ధమా!

Thandel: శివ-పార్వతులకు చై, సాయి పల్లవి సంగీత విందు..మ్యూజికల్ ట్రీట్కు సిద్ధమా!

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా టాలెంటెడ్ దర్శకుడు చందు మొండేటి (Chandu mondeti) కాంబోలో తెరకెక్కుతున్న మూవీ తండేల్(Thandel). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా..నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్గా నటిస్తోంది.

ఇదివరకే.. ఎసెన్స్ ఆఫ్ తండేల్ (Essence Of Thandel) అంటూ ఈ గింప్ల్స్ రిలీజ్ చేసి సినిమాలో ఉండే ఇంటెన్స్ ఎమోషన్ తో క‌థ చేప్పేశాడు డైరెక్టర్ చందు మొండేటి. తాజాగా తండేల్ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. త్వరలో ఈ సినిమా నుంచి అదిరిపోయే ఫస్ట్ లిరికల్ రిలీజ్ చేయబోతున్నట్లు చై, సాయి పల్లవి ఫొటోస్ షేర్ చేశారు.

Also Read:-గ్రాస్ ఎంత.. నెట్ ఎంత?

"శివ-పార్వతులకు సంగీత విందు.. తండేల్లోని ఈ అద్భుతమైన పాట చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది.. రాక్‌స్టార్ దేవిశ్రీ బీట్స్ నుండి చై, సాయి పల్లవి చేసే నాట్యం మరింత ప్రత్యేకంగా ఉంటుంది.. అందుకు భారీ ట్రీట్ కోసం సిద్ధంగా ఉండండి " అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించిన చై-సాయి పల్లవిల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందనే డేట్ మాత్రం చెప్పలేదు. 

గుజరాత్‌ లోని సూరత్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. బోటు నడిపే వ్యక్తి బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లగా..అలా సముద్రవేట లో ఉంటూ పాకిస్థాన్‌ కోస్టుగార్డుల చెరలో చిక్కుతాడు. అలా అక్కడి పాకిస్థాన్ జైలు నుంచి..అత‌డు ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా స్టోరీ.