నాగచైతన్య, శోభిత ఎంగేజ్ మెంట్ ఇలా

అక్కినేని ఇంటి శుభకార్యం. నాగార్జున కుమారుడు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ జరిగింది. 2024, ఆగస్ట్ 8వ తేదీ ఉదయం 9 గంటల 42 నిమిషాలకు.. సొంత ఇంట్లోనే.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా సాగింది. వాళ్లిద్దరూ జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ.. నాగార్జున ట్విట్ చేశారు.

“ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగిన మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది!! ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.సంతోషకరమైన జంటకు అభినందనలు!వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను" అని నాగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

శోభితా ధూళిపాళ ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన అమ్మాయి. ఆమె ముంబై యూనివర్సిటీ, హెచ్‌ఆర్‌ కాలేజీలో కామర్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ పూర్తిచేసింది. 2013లో మిస్‌ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకున్నది. ఇక అడవిశేష్ నటించిన గూఢచారి సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.