
నాగ చైతన్య, శోభితా (డిసెంబర్ 4, 2024 న) వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇపుడు ఈ కొత్త జంట ఎక్కడ కనిపించిన సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కన్ఫమ్ అయింది. తాజాగా ఈ లవ్ కపుల్ యూరప్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. నేడు శుక్రవారం(మార్చి 7న) శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో వెకేషన్ ఫోటోలు షేర్ చేసింది.
అందులో.. 'ఒక కేఫ్‌లో ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసింది. శోభిత “వైబ్స్” క్యాప్షన్ తో ఈ ఫోటోలు పంచుకుంది. ఒక ఫొటోలో ఉల్లిపాయ సమోసాలు తింటూ దేశీ వంటకాలను చూపిస్తుంది. అలాగే మరో ఫొటోలో ఓ బ్యూటిఫుల్ గ్లామర్ పిక్ ను పంచుకుంది.
Also Read:-ఓటీటీలోకి వంద కోట్ల తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
CMLL (కాన్సెజో ముండియల్ డి లుచా లిబ్రే) రెజ్లింగ్ మ్యాచ్ నుండి ఒక వీడియో, దాంతో పాటూ గోరింట పెయింట్ చేసిన అరచేతుల స్నాప్‌షాట్ ఇలా శోభిత వైబ్స్ కలర్ ఫుల్గా నిండిపోయింది. ప్రస్తుతం వీరి వెకేషన్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నూతన వధూవరులు తమ కొత్త జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.
ఇకపోతే.. ఈ జంట పెళ్లయ్యాక.. అనేక ఈవెంట్స్ లో కనిపించారు. మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. వారు పవిత్ర స్థలంలో ప్రార్థనలు చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. తన భర్తతో కలిసి ఆలయం లోపలికి నడుస్తూ శోభిత నారింజ రంగు చీరలో అద్భుతంగా కనిపించింది. అలాగే తండేల్ ఈవెంట్స్ లో కూడా వీరిద్దరూ కనిపించి ఫ్యాన్స్ కు కనువిందు చేశారు.