Naga Chaitanya wedding: టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరివురూ ఇప్పటికే ఆగస్ట్ 8న నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4న నాగ చైతన్య వివాహం ఇరువురి పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి ముహూర్తం కుదిర్చారు. దీంతో పెళ్లి పత్రికల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అక్కినేని అభిమానులు నాగ చైతన్య కి విషస్ తెలియేజస్తున్నారు.
నాగ చైతన్య పెళ్లికి టాలీవుడ్ ప్రముఖ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీలతో పాటూ బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ తదితరులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున, నాగ చైతన్యకి అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ కుటుంబాలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో నాగార్జున వీరిద్దరిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ALSO READ | Naga Chaitanya,Sobhita: నాగ చైతన్య - శోభిత మ్యారేజ్ డేట్ ఫిక్స్.. పెళ్లి ఎక్కడంటే?
ఈ విషయం ఇలా ఉండగా నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించగా రాక స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మలయాళ బ్యూటీఫుల్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుంది.