టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఎంగేజ్ మెంట్ 2024 ఆగస్టు 8న గ్రాండ్గా జరిగింది తెలిసిందే. ఈ తరుణంలో వీరి పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇరువురి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఈ మధ్యే శోభితా ధూళిపాళ్ల ఇంట్లో తన పెళ్లి పనులు షురూ అయినట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. శోభితా పసుపు దంచుతున్న ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్ ఇస్తూ ఫోటోలు షేర్ చేయగా అక్కినేని ఫ్యాన్స్ను బాగా ఇంప్రెస్ చేశాయి.
అయితే.. అక్టోబర్ 28న జరిగిన ANR అవార్డ్స్ కార్యక్రమంలో ఈ జంట ఎంతో ఉత్సాహంగా కనిపించారు. దాంతో పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరగనుందని అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. వీరి పెళ్లి తేదీ ఫిక్సయినట్లు తెలుస్తోంది. 2024 డిసెంబర్ 4న నాగ చైతన్య - శోభితల వివాహం జరగనుందని సినీ సర్కిల్లో టాక్ మొదలైంది. త్వరలో వీరి పెళ్లి తేదీపై ఇరు కుటుంబాలు అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈ అక్కినేని వారి పెళ్లి మొదట వైజాగ్ లో జరగనుందని వార్తలు రాగా.. ఇపుడు అన్నపూర్ణ స్టూడియోలో జగనున్నట్లు తెలుస్తోంది.
ALSO READ : KeerthySuresh: పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ బేబీ జాన్ టీజర్ రిలీజ్.. వరుణ్ ధావన్ మాస్ మాములుగా లేదు
ఇప్పటికే వీరి పెళ్లి వేదికకు సంబంధించిన భారీ సెట్ కూడా వేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఇపుడు మరో పెళ్లి వేదిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చై- శోభిత జైపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను జరుపుకోవచ్చని టాక్. అయితే.. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ జంట పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. అంగరంగ వైభవంగా జరిగే ఈ కళ్యాణోత్సవానికి స్టూడియో లోపల ప్రత్యేక మండపాన్ని నిర్మిస్తున్నట్లు నాగ్ అన్నట్లు సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలో అధికారిక వెన్యూ ఎక్కడ అనేది తెలిసే అవకాశం ఉంది.