అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. అన్నపూర్ణ స్టూడియో ఎంతో రంగ రంగ వైభవంగా వేదిక ముస్తాబవుతుంది. ఇవాళ బుధవారం (డిసెంబర్ 4న) నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్లల(Sobhita Dhulipala) వివాహం జరగనుంది.
ఇవాళ రాత్రి 8.13 గంటలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో మూడు ముళ్ల బంధంతో వీరిద్దరూ ఒక్కటి కానున్నారు. దాదాపు 8 గంటలపాటు పెళ్లికి సంబంధించిన అన్ని క్రతువులు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తారని సమాచారం.
ఈ నేపథ్యంలో అక్కినేని వారి పెళ్లి వేడుకకు ఎవరెవరు వస్తున్నారనేది చర్చనీయాంశమైంది. దాదాపు 300-400మంది హాజరవుతారని టాక్ వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేస్తున్నట్లు సమాచారం.
తెలుగు ఇండస్ట్రీ నుంచి మెగా ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ సందడి చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, మహేశ్ బాబు, నమ్రత, రామ్ చరణ్, ఉపాసన, ఎన్టీఆర్ వస్తున్నట్లు సమాచారం. పుష్ప 2 రిలీజ్ బిజీలో ఉన్న అల్లు అర్జున్ సైతం తన కుటుంబంతో వస్తారని తెలుస్తోంది.