టాలీవుడ్ ప్రముఖ హీరో నాగచైతన్య స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 8న వీరివురి ఎంగేజ్మెంట్ పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. దీంతో నాగ చైతన్య, శోభిత పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారు.
అయితే పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో నాగ చైతన్య తన మాజీ భార్య సమంతతో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పూర్తిగా డిలీట్ చేశాడు. ఈ క్రమంలో ఫార్ములా 1 రేస్ ట్రాక్ పై 2018లో తీసిన చివరి ఫోటోని నాగ చైత్యన్య తొలగించాడు. అయితే నటి సమంత కూడా 2021లో విడాకుల అనంతరం నాగచైతన్యతో కలసి దిగిన అన్ని ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలనుంచి డిలీట్ చేసింది.
ఈ విషయం ఇలా ఉండగా నటి సమంత నాగ చైతన్యల వివాహం ఇరువురి పెద్దల సమక్షంలో 2017లో అక్టోబర్ 06న హిందూ, క్రిస్టియన్ ఆచార సంప్రదాయాల పద్దతిలో జరిగింది. అయితే పెళ్లయిన 4 ఏళ్ళ తర్వాత 2021 లో ఇరువురి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. దీంతో నాగ చైతన్య మళ్లీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. కానీ సమంత మాత్రం పెళ్లి చేసుకోకుండా సినిమాలు, వ్యాపారాలు అంటూ బిజిబిజీ గా గడుపుతోంది.
ALSO READ : Suriya Jyothika:18 ఏళ్ల తర్వాత జోడీగా సూర్య, జ్యోతిక.. తెరపై అద్భుతం చూపించనున్న లేడీ డైరెక్టర్!
ఇక హీరో నాగచైతన్య కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో తండేల్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడీగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించినప్పటికీ పలు కారణాలవల్ల వాయిదా పడినట్లు సమాచారం.