పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా నుండి విడుదలవుతున్న టీజర్ చూస్తుంటే ఇపుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని అనుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన బుజ్జి టీజర్ కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
బుజ్జి అంటే ప్రభాస్ ఈ సినిమాలో వాడే కారు. ఈ కారుకి సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇటీవలే ఒక భారీ ఈవెంట్ నిర్వహించి బుజ్జి కారును ఆడియన్స్ కు పరిచయం చేశారు మేకర్స్. భవిషత్తుకి సంబంధించిన కారు కావడంతో చాలా డిఫరెంట్ గా ఉంది ఈ కారు. అందుకే.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బుజ్జి. చూసిన వాళ్ళందరూ బలేగా ఉంది బుజ్జి కారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఈ బుజ్జి కారు మరో స్టార్ మనసును కూడా లాగేసిందట. అందుకే.. వెంటనే ఆ కారు ఎక్కి రైడ్ చేసి రఫ్ఫాడించేశాడు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. అక్కినేని నాగ చైతన్య. అవును.. నాగ చైతన్యకి కార్లంటే చాల పిచ్చి. అందుకే.. బుజ్జి కారుని చూసిన వెంటనే ఆ కారును ఎలాగైనా రైడ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. అనుకున్నదే తడువుగా వచ్చేసి బుజ్జి కారుని నడిపి తన సరదా తీర్చుకున్నాడు చై. ఇక ఈ కారు గురించి చై మాట్లాడుతూ.. నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. నువ్వు ఇంజనీరింగ్ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేశావ్.. అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కల్కి సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.