తండేల్(Thandel).. అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ. దర్శకుడు చందు మొండేటి(Chandu Mondeti) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్(Sai Pallavi) గా నటిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షెరవేగంగా జరుగుతోంది. తాజాగా తండేల్ షూటింగ్ నుండి నాగ చైతన్య లుక్ కి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
#Tandel Shooting Start #NagaChaitanya Mass Entry ?? pic.twitter.com/nVVengRFZA
— Muddana Prasad Babu (@NagPrasad9) December 20, 2023
ఓ పిక్ లో నాగ చైతన్య నుదుటన ఎర్ర బొట్టుతో, లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఇక మరో నటుడు నాగ చైతన్య చేయి పైకి లేపి జనాలకు అభివాదం చేస్తున్నారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజజీవితం కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. తండేల్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి నాగ చైతన్య చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ తండేల్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.