టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ గతఏడాది చివరిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య, శోభిత గత కొనేళ్ళుగా ప్రేమలో ఉన్నారు. దీంతో ఇరువురి ఫ్యామిలీ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత ఏడాది డిసెంబర్ 04న అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ఇటీవలే నాగ చైతన్య తన వైవాహిక జీవితం గురించి స్పందించాడు.
ఇందులోభాగంగా పెళ్లి తర్వాత తాను శోభిత చాలా సంతోషంగా ఉన్నామని తెలిపాడు. కెరీర్ పరంగా ఇరువురం తమ సలహాలు ఇచ్చిపుచ్చుకుంటామని చెప్పుకొచ్చాడు. అలాగే తాను ఏదైనా పని మొదలు పెట్టేముందు కచ్చితంగా శోభిత సలహాలు, సూచనలు తీసుకుంటానని, తనకి సంబంధించిన ఏ పనైనా ముందుగా శోభిత డిసైడ్ చేస్తుందని తెలిపాడు. ఇక ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో శోభిత ఎప్పుడూ ముందుటుందని దీంతో ఎలాంటి మనస్పర్థలు, విబేధాలకు తావు లేకుండా హ్యాపీగ ఉన్నామని చెప్పుకొచ్చాడు.
ALSO READ | Gaami: విశ్వక్‌సేన్ సినిమాకి అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపిక
తనకి శోభిత పుట్టి పెరిగిన విశాఖపట్నం అంటే చాలా ఇష్టమని దీంతో సెలవులు ఎంజాయ్ చేయడానికి వైజాగ్ కి వెళ్తుంటానని తెలిపాడు. ఇక మంచి స్క్రిప్ట్ దొరికితే కచ్చితంగా తన భార్య శోభితతో కలసి సినిమా చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు. ఓవరాల్ గా ప్రస్తుతం తామిద్దరూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగ చైతన్య తెలుగులో తండేల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా మలయాళ బ్యూటీఫుల్ హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా వచ్చే నెల 7న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు నిర్మించగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కి మాంచి రెస్పాన్స్ వచ్చింది.