![Naga Chaitanya Divorce: డైవర్స్ తర్వాత నన్నెందుకు క్రిమినల్ గా చూస్తున్నారంటూ ఎమోషనల్...](https://static.v6velugu.com/uploads/2025/02/naga-chaitanya-react-about-divorce-with-samantha_boDI94Z2qA.jpg)
Naga Chaitanya Divorce: సినీ సెలెబ్రటీల వ్యక్తిగత జీవితాలపై చాలామంది ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో వారి జీవితాల్లో ప్రేమ, పెళ్లి వంటి అంశాలలో రోజుకో గాసిప్, రూమర్ వైరల్ అవుతూ ఉంటుంది. ఐతే టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇటీవలే ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వూలో పాల్గొని తన మాజీ భార్య సమంతతో విడాకుల విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇందులో భాగంగా తాను, సమంత పరసర్పర అంగీకారంతోనే విడిపోయామని ఇందులో ఎవరి బలవంతం లేదని క్లారిటీ ఇచ్చాడు. అలాగే తాను అప్పటికే ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చానని దీంతో ఓక్ రిలేషన్ ని బ్రేక్ చెయ్యాలంటే ఒకటికి వెయ్యి సార్లు ఆలోచిస్తానని ఎమోషనల్ అయ్యాడు. ఇక సమంతతో విడాకుల తర్వాత తమకి నచ్చినట్లు బ్రతుకుతున్నామని అలాగే తమ ప్రైవసీ ని గౌరవించి ఈ విషయాన్ని పెద్దది చెయ్యకూడదని చెప్పినప్పటికీ రోజుకో వార్త మాత్రం వైరల్ అవుతూనే ఉంటుందని అన్నాడు. అలాగే మా రిలేషన్ షిప్ ఒక్క రాత్రిలో బ్రేక్ అవ్వలేదని చాలా రోజులుగా ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాతే డైవర్స్ తీసుకున్నామని తెలిపాడు. కానీ విడాకుల అనంతరం తనని ఎదో నేరం చేసిన క్రిమినల్ మాదిరిగా చూశారని వాస్తవం ఏమిటనేది తామిద్దరికీ తెలుసని చెప్పుకొచ్చాడు.
ALSO READ | Chiranjeevi: ప్రధాని మోదీకి స్పెషల్ థాంక్స్ చెప్పిన చిరు.. ఎందుకంటే.?
ఈ విషయం ఇలా ఉండగా నటి సమంత 2017లో టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ 5 ఏళ్లపాటు కలసి ఉన్నారు. కానీ అనుకోని కారణాలవల్ల పరస్పర అంగీకారంతో 2021వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ విడాకుల తర్వాత అక్కనేని నాగచైతన్య గత్ ఏడాది డిసెంబర్ లో తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ సమంత మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోలేదు. దీంతో ప్రస్తుతం సమంత ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క బిజినెస్ లో కూడా పెట్టుబడులు అంటూ బిజిబిజీగా గడుపుతోంది.
నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే ఇటీవలే హీరోగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపాలవి నటించింది. ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించగా స్టార్ ఫిలిం ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించాడు.