నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి రూపొందిస్తున్న చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఈనెల 28న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగ చైతన్య ఇంటెన్స్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. అల్యూమినియం బకెట్‌ని వెపన్‌గా పట్టుకొని విలన్స్‌ని చంపడానికి సిద్ధంగా ఉన్న ఫెరోషియస్ గెటప్‌లో కనిపిస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచింది. లవ్ ఎలిమెంట్స్‌తో పాటు, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.