తండేల్‌ హైలెస్సో హైలెస్సా

తండేల్‌ హైలెస్సో హైలెస్సా

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్‌‌‌‌‌‌‌‌’.  చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌ ‘బుజ్జి తల్లి’,  ఇటీవల విడుదలైన ‘నమో నమః శివాయ’ పాటలకు ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది.   

తాజాగా థర్డ్ సింగిల్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘హైలెస్సో హైలెస్సా’ అంటూ సాగే పాటను ఈనెల 23న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది. 

సముద్ర తీరంలో నాగ చైతన్య నవ్వుతూ కనిపిస్తుంటే.. తన ఎదురుగా బ్యూటిఫుల్‌‌‌‌‌‌‌‌గా డ్యాన్స్ చేస్తోంది సాయిపల్లవి.  దేవిశ్రీ  ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది.