Thandel Ticket Prices: పెరిగిన తండేల్ టికెట్ల ధరలు.. ప్రభుత్వం ఎంత పెంచిందంటే?

Thandel Ticket Prices: పెరిగిన తండేల్ టికెట్ల ధరలు.. ప్రభుత్వం ఎంత పెంచిందంటే?

అక్కినేని నాగ చైతన్య, సహజ నటి సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ కమ్ దేశభక్తి మూవీ తండేల్. ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 7న) ప్రపంచవ్యాపంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా తండేల్ చిత్ర యూనిట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 

తండేల్ మూవీ టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం (ఫిబ్రవరి 4న) ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.50 (జీఎస్టీతో), మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 (జీఎస్టీతో) పెంచుకునేలా వీలు కల్పించింది. ఈ ధరలు సినిమా రిలీజైన వారం రోజుల పాటు కొనసాగుతాయని జీవోలో పేర్కొంది.

అయితే, తెలంగాణలో టికెట్టు ధరల పెంపుకు అవకాశం లేకపోవడంతో తండేల్ చిత్ర బృందం ఇక్కడి ప్రభుత్వాన్ని కోరలేదు.సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు ఉండదంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. దీంతో తండేల్ టికెట్టు ధరలు కేవలం ఏపీలోనే పెరిగాయి. తెలంగాణాలో ఎప్పుడు ఉండే ధరలే కొనసాగుతాయి.

ALSO READ : Actress Pushpalatha: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..

తండేల్ మూవీని గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించింది. నిజజీవిత ఆధారంగా రూపొందిన తండేల్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇందులో హీరో నాగ చైతన్య.. 'రాజు' అనే ఓ మత్స్యకారుని పాత్రలో నటించాడు. ఎలాంటి కట్స్ లేకుండా తండేల్ సినిమాకు సెన్సార్ బోర్డ్ అధికారులు U/A సర్టిఫికేట్‌ జారీ చేశారు.