బాహుబలి ప్రొడక్షన్ హౌజ్ తో నాగ చైతన్య భారీ బడ్జెట్ సినిమా.. జోనర్ అదేనా..?

బాహుబలి ప్రొడక్షన్ హౌజ్ తో నాగ చైతన్య భారీ బడ్జెట్ సినిమా.. జోనర్ అదేనా..?

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య సినిమాల విషయంలో గేర్ మార్చాడు. దీంతో కథల పరంగా కోడోత్ విభిన్న కథనాలు ఎంచుకుంటూ ఆడియన్స్ ని అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం నాగ చైతన్య బాహుబలి సినిమా ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ ప్రొడక్షన్ హౌజ్ తో కలసి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్, కామెడీ ఫ్లిక్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు సమాచారం. ఆమధ్య వచ్చిన విరూపాక్ష, పొలిమేర సినిమాలు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో నాగ చైతన్య ఈ జోనర్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా దాదాపుగా ఫైనల్ నేరేషన్ పూర్తవడంతో వచ్చే ఏడాది మార్చ్ లో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. 

ఇక సినిమా బడ్జెట్ కూడా దాదాపుగా రూ.120 కోట్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ నాగ చైతన్యకి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. అలాగే హిట్లు కూడా ఉన్నాయి. కానీ ఆమధ్య కొన్ని సినిమాల కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో డిజాస్టర్లు అందుకున్నాడు. 

ALSO READ : మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై ప్రొడ్యూసర్ క్లారిటీ... ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తాం..

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మళయాళ  బ్యూటీ సాయిపల్లవి నటించగా  ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.