![Dhootha Season 2: సస్సెన్స్ థ్రిల్లర్ దూత 2 రాబోతుంది..కన్ఫర్మ్ చేసిన నాగ చైతన్య!](https://static.v6velugu.com/uploads/2024/03/naga-chaitanya-tweet-sparks-hope-for-dhootha-season-2_4zVXq5LDr1.jpg)
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా వచ్చిన వెబ్ సిరీస్ దూత(Dhootha).క్రియేటీవ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్(Vikram K Kumar) తెరకెక్కించిన ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్.. సరికొత్త కథా కథనాలతో ఆడియన్స్ ను థ్రిల్ చేసింది. మొత్తం ఏడూ ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఊహకందని ట్విస్ట్, టర్న్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. అందుకే ఈ సిరీస్ లో ప్రతీ పాత్రకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.
అయితే రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఆర్ యూ రేడీ"అనే ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో దూత సీక్వెల్ పై ఎటువంటి అనౌన్స్ చేయలేదు.ముఖ్యంగా ఈ ఈవెంట్ యొక్క ముఖ్యోద్దేశ్యం..అమెజాన్ ప్రైమ్ లో వచ్చే ఫ్యూచర్ సినిమాలు, సిరీస్‌లతో పాటు సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్‌లకు సంబంధించిన తర్వాత సీక్వెల్స్ అనౌన్స్ చేయడమే.
కానీ, ఇక్కడ దూత సీక్వెల్ పై ఎవరు నోరు మెదపలే.దీంతో ఫ్యూచర్ లో సీక్వెల్ రాకపోవొచ్చు అని ఫ్యాన్స్ డీలా పడ్డారు. ఇక అదే టైంలో చై తన సోషల్ మీడియాలో అకౌంట్ లో ఇంట్రెస్టింగ్ అనౌన్స్ చేసి ఆశలు పెంచేశాడు.
దూత సక్సెస్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఇది చాలాసంతృప్తినిచ్చింది. మరిన్నింటి కోసం ఎదురు చూస్తున్నాను..త్వరలో" అని రాసుకొస్తూ స్మైల్ ఎమోజీ షేర్ చేశాడు. ఇక దూత 2 సీజన్ ఉంటుందని, త్వరలో ఓటీటీలోకి రావడం కన్ఫమ్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.అయితే..ధూత 2 సీజన్ పై డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ నుంచి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
#dhootha success call out ! It’s been such a satisfying one ! Looking forward to more .. soon :) @Vikram_K_Kumar #northstarentertainment @PrimeVideoIN pic.twitter.com/mD3ERxCMPD
— chaitanya akkineni (@chay_akkineni) March 21, 2024