అక్కినేని నాగ చైతన్య.. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కస్టడీ(Custody). ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మే 12 శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ‘కస్టడీ’ సినిమా ఎలా ఉంది? కానిస్టేబుల్‌గా నాగచైతన్య ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథపరంగా బాగానే ఉన్నా.. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగుంటే మూవీ నెక్స్ట్ లెవల్లో ఉండేది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఈ మూవీలో నాగచైతన్య యాక్టింగ్ తన కెరీర్ బెస్ట్ అని చెప్తున్నారు. కానిస్టేబుల్ పాత్రలో చై ఇరగదీశాడట. ఇక మరో ముఖ్య పాత్రలో కనిపించిన అరవింద స్వామి క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉందట. ఈ సినిమాకు ఈ ఇద్దరే మెయిన్ పిల్లర్స్ గా నిలిచారట.
హీరోయిన్ కృతి కూడా తన పాత్ర మేరకు పరవాలేదు అనిపించిందని సమాచారం. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతమే సినిమాకి ప్రధాన బలం అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫారెస్ట్ సీన్ లో నేపథ్య సంగీతం మాత్రం అద్భుతమని కామెంట్ చేస్తున్నారు. కానీ పాటలు ఆకట్టుకునేలా లేవట.
ఇక మొత్తంగా చెప్పాలంటే.. కస్టడీ సినిమా నెమ్మదిగా మొదలై ప్రిడిక్టబుల్ నెరేషన్ తో సాగుతుందట. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఫిఫ్టీ, ఫిఫ్టీ శాతం విజయం సాధించే అవకాశం ఉందని, కానీ నాగచైతన్య కెరీర్‌లో ఓ మెమరబుల్ మూవీ అవుతుందననే కామెంట్స్ వినిపిస్తున్నాయి.