మళ్ళీ విడాకుల గొడవలో నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య(Naga chaitanya) మరోసారి విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగనున్నారు. అదేంటి ఇప్పటికే సమంత(Samantha), నాగ చైతన్యకు విడాకులు వచ్చేశాయి కదా.. మళ్ళీ విడాకులు ఏంటి అనుకుంటున్నారా. ఇక్కడే ఉంది అసలు ట్విస్టు. నాగ చైతన్య ఈసారి విడాకుల కోసం తిరిగేది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్. 

అవును నాగ చైతన్య తన తరువాత సినిమా కోసం డివోర్స్ కాన్సెప్ట్ ను ఓకే చేశారట. దీనికి సంబందించిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా సామజవరగమన(Samajavaragamana) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు రామ్‌ అబ్బరాజు(Ram abbaraju) నాగ చైతన్య కోసం అదిరిపోయే కథను రెడీ చేశారట. ఈ కథ మొత్తం విడాకుల చుట్టూనే తిరుగుతుందని టాక్. నాగ చైతన్యకు క్కూడా ఈ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. 

ALSO READ :తనకు కాబోయే భర్తను చూపించేసిన ఇలియానా

ఇక నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి(Chandu mondeti) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. గీత ఆర్ట్స్(Getha arts) సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ ప్రాజెక్టు కోసం స్టార్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారట. ఈ సినిమా తరువాతే నాగ చైతన్య, రామ్‌ అబ్బరాజు సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరి ఈ రెండు సినిమాలు నాగ చైతన్యకు ఎలాంటి రిజల్ట్ ను అందిస్తాయి చూడాలి.