అక్కినేని నట వారసుడిది పదిహేనేళ్ల ప్రయాణం

అక్కినేని నట వారసుడిగా ‘జోష్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య.. సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ సినిమాలతో కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దూసుకెళ్తున్నాడు. సెప్టెంబర్ 5కి తను నటించిన ‘జోష్’ మూవీ విడుదలై 15 ఏళ్లు పూర్తయింది. ఈ జర్నీలో హండ్రెడ్ పర్సెంట్ లవ్, ఏ మాయ చేశావే, వెంకీ మామ, మజిలీ, లవ్ స్టోరీ లాంటి చిత్రాలతో తెలుగుతో పాటు ‘దూత’ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విజయాన్ని అందుకున్నాడు. 

అలాగే  తన ఫ్యామిలీ అందరితో స్ర్కీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్ చేసుకుని ‘మనం’ చిత్రాన్ని  మెమరబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మూవీగా మలచుకున్నాడు. ఇలా  స్ర్కిప్ట్ సెలెక్షన్ నుంచి క్యారెక్టర్స్ వరకు తనదైన మార్క్ ఉండేలా చూసుకుంటూనే.. తెలుగు ఇండస్ట్రీలో తాత నాగేశ్వరరావుకు ఉన్న ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  తండ్రి నాగార్జునకు ఉన్న  స్టార్ డమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏమాత్రం పాడు చేయకుండా  అక్కినేని ఫ్యామిలీ లెగసీని కొనసాగిస్తున్నాడు చైతూ.

ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నాడు. తను ఇండస్ట్రీకొచ్చి పదిహేను ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  సాయి పల్లవి హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని  అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు  నిర్మిస్తున్నారు..