అమ్మాయిలని ఏడిపించకండి.. ఆటోమేటిక్ గా ఫేస్ గ్లో వస్తుందంటున్న నాగ చైతన్య..

అమ్మాయిలని ఏడిపించకండి.. ఆటోమేటిక్ గా ఫేస్ గ్లో వస్తుందంటున్న నాగ చైతన్య..

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య,  బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఈ నెల 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ తో పాటూ సాయి పల్లవి ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తండేల్ నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్ అంచనాలు పెంచేసాయి. దీంతో మేకర్స్ కూడా ఈ సినిమాపై మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 

అయితే తండేల్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి నాగ చైతన్యని పలు ప్రశ్నలు అడిగి ఇంటర్వూ చేసింది. ఇందులో భాగంగా మీరు తండేల్ సినిమా ఎందుకంత స్పెషల్ అనుకుంటున్నారు అని నాగ చైతన్య ని అడిగింది. దీంతో నాగ చైతన్య స్పందిస్తూ ఈ సినిమా ట్రూ స్టోరీ అని అలాగే ఈ సమయంలో తనకి మంచి హిట్ కావాలాని అందుకే తండేల్ సినిమా చాలా స్పెషల్ ని చెప్పాడు. ఇక ట్విట్టర్ లో ఓ ఫ్యాన్ బడ్జెట్ లో బాయ్స్ కి స్కిన్ కేర్, ఫేస్ గ్లో బ్యూటీ టిప్స్ చెప్పండి భయ్యా అని అడుగుతున్నాడని సాయి పల్లవి అడిగింది. దీంతో ఫేస్ గ్లో టిప్స్ అంటే ఏముంది బ్రదర్.. హ్యాపీగా ఉండండి..  అమ్మాయిలని ఏడిపించకండి.. ఆటోమేటిక్ గా ఫేస్ గ్లో వస్తుందంటూ రిప్లయ్ ఇచ్చాడు. 

ALSO READ | డార్లింగ్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశ తప్పదా... రాజాసాబ్ రిలీజ్ వాయిదా పడనుందా..?

ఇక ఇంకో ఫ్యాన్ యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు అని అడగ్గా.. యాక్టింగ్ అనేది ఒక్కరోజు నేర్చుకుని వదిలేసేది కాదని.. కంటిన్యూగా నేర్చుకుంటూనే ఉండాలని.. అలాగే తాను కూడా ప్రతీ రోజు ఎదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటానని ఇట్స్ ఏ కంటిన్యూ ప్రాసెస్ అని ఆన్సర్ ఇచ్చాడు. ఇక మీరు నెగిటివ్ రోల్ లో ఎప్పుడు నటిస్తారని ఒక ఫ్యాన్ అడిగాడు. దీంతో నాగచైతన్య ఏకంగా సాయి పల్లవి దర్శకత్వం వహించే సినిమాలో కచ్చితంగా నెగిటివ్ రోల్ చేస్తానని చెబుతూ సరదాగా నవ్వించాడు. మొత్తానికి ఈ ఇంటర్వూ వీడియో ఫన్నీ గా సాగుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.