Thandel box office collection day 1: మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన తండేల్... ఎన్ని కోట్లంటే ?

Thandel box office collection day 1: మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన తండేల్... ఎన్ని కోట్లంటే ?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి, స్టార్ హీరో నాగ చైతన్య క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన "తండేల్" శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నాగచైతన్యకి జంటగా మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిపల్లవి నటించగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. రియల్ లైఫ్ & లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. నాగ చైతన్య, సాయిపల్లవి మధ్య రొమాన్స్, డీఎస్పీ మ్యూజిక్, చందూ మొండేటి టేకింగ్ ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవ్వడంతో మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ సాధించినట్లు తెలుస్తోంది. 

అయితే ఓవర్సీస్ లో 4 లక్షల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.3.25 కోట్లు) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ అధికారంగా ప్రకటించారు.   ఇక sacnilk సమాచారం ప్రకారం నార్త్, సౌత్ లో కలిపి దాదాపుగా రూ.10.25 కోట్లు (నెట్) కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.9.8 కోట్లు రాబట్టగా హిందీ, తమిళ్, కన్నడ తదితర భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీన్నిబట్టి చూస్తే నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇదేనని చెప్పవచ్చు. 

ALSO READ | సినిమా సక్సెస్ అయితే అందరికీ క్రెడిట్ ఇవ్వాలి.. ఒక్కరికే కాదంటున్న డీఎస్పీ..

గతంలో నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ మొదటి రోజు 10 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. అయితే రిలీజ్ కి ముందు మిక్స్డ్ టాక్ ఉండటంతో మొదటిరోజు కలెక్షన్స్ పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కానీ రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ ఉండటం, శని ఆదివారాలు సెలవులు కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ విషయం ఇలా ఉండగా గత కొన్నేళ్లుగా నాగ చైతన్య కి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో తండేల్ నాగ చైతన్యకి బిగ్ రిలీజ్ ఇచ్చిందని చెప్పవచ్చు.