లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్లు కొట్టిన చైతు ఇప్పుడు ‘థ్యాంక్యూ’ సినిమాతో హ్యట్రిక్ హిట్ కొట్టేటట్లు టీజర్ చూస్తుంటే అనిపిస్తోంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన థాంక్యూ మూవీ టీజర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే నాగ చైతన్య ఖాతాలో మరో హిట్ పడనట్లేనని అక్కినేని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
Nannu nenu sari cheskotaaniki, nenu chesthunna prayaname Thank you ! Here’s the teaser https://t.co/h9AWnduZWW#ThankYouTeaser @Vikram_K_Kumar @MusicThaman
— chaitanya akkineni (@chay_akkineni) May 25, 2022
@RaashiiKhanna_@pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic#ThankYouTheMovie pic.twitter.com/AZaMjCCGKT
‘లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు .. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను’ అనే చైతూ డైలాగ్ ను బట్టి చూస్తే... ఆయనకి ఏదో సీరియస్ గోల్ ఉన్నట్లుగా అర్థమవుతోంది. ‘నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి నేనే చేస్తున్న ప్రయాణమే’ అంటూ సాగే ఇంకో డైలాగ్ చైత్ పర్సనల్ లైఫ్ ను ప్రతిబింబించేలా ఉందని అందరూ అనుకుంటున్నారు. లవ్, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్... ఇలా ప్రతి ఎమోషన్ ఈ మూవీలో ఉన్నట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఇందులో ముగ్గురు హీరోయిన్లు కనిపించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కాగా... జూలై 8వ తేదీన ‘థాంక్యూ’ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
మరిన్ని వార్తల కోసం...