ఘనంగా నాగుల పంచమి వేడుకలు

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

నాగుల పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారు. పుట్టల్లో పాలు పోయడానికి భక్తులు క్యూ కడుతున్నారు.  ఆలయాలను సుందరంగా అలంకరించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా వస్తున్నారు. పుట్ట వద్ద పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా  తెల్లవారుజామున నుండి పుట్టలో పాలు పోయడానికి క్యూలైన్ లో మహిళలు వస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట శ్రీ విశ్వేశ్వర దేవాలయంలో నాగుల పంచమి పురస్కరించుకుని తెల్లవారు జామున నుండి భక్తులు బారులు తీరారు.

పుట్టలో పాలు పోస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పెద్దమ్మ ఆలయం వద్ద పుట్టలో మహిళలు పాలు పోస్తున్నారు.  నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి కాలనిలో బంగారు మైసమ్మ ఆలయం వద్ద నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని ఆలయాల్లో నాగ పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాగేంద్ర స్వామికి, పుట్టల వద్ద భక్తులు క్యూ కట్టారు. హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలో భక్తుల తాకిడి అధికంగా ఉంది. అభిషేకాలు, పాలు, పండ్లు, పసుపు కుంకుమతో భక్తి శ్రదలతో పూజలు నిర్వహిస్తున్నారు.