యంగ్ హీరో నాగ శౌర్య (Naga Shourya) తన కొత్త సినిమాను ప్రకటించాడు. నేడు నాగ శౌర్య పుట్టిన రోజు (జనవరి 22) సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. 'బ్యాడ్ బాయ్ కార్తీక్' (BadBoyKarthik) అనే క్రేజీ టైటిల్తో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో నాగ శౌర్య ఇంటెన్స్ లుక్స్ లో ఉన్నాడు. అలాగే చేతి నిండా రక్తం, ఆ బ్లడ్‌ను నుదుటున అడ్డంగా పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రంలో నాగ శౌర్య పూర్తిగా సరికొత్త పాత్రలో కనిపించబోతోన్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఓవరాల్ గా నాగ శౌర్య ఇందులో ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు రామ్ దేసిన దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వైష్ణవి ఫిలీం బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మెలోడీ వండర్ హరీస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
ఇక రీసెంట్ టైమ్స్లో కామెడీతో మంచి బజ్ క్రియేట్ చేసింది రంగబలి మూవీ. కానీ, పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ప్రస్తుతం నాగ శౌర్యకు కూడా మంచి హిట్ అవసరం. ఛలో మూవీ తర్వాత.. నాగ శౌర్యకు హిట్ పడలేదు. ఇప్పుడు బ్యాడ్ బాయ్ కార్తీక్తో హిట్ పడటం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా నాగ శౌర్యకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి.
#NagaShaurya's New Movie Titled #BadBoyKarthik, Intense First Look Launched ❤️🔥 🔥#HBDNagaShaurya pic.twitter.com/urAVegmWsy
— Ramesh Pammy (@rameshpammy) January 22, 2025