అక్కినేని నాగేశ్వర రావు బయోపిక్లో నాగార్జున: నాగ సుశీల

అక్కినేని నాగేశ్వర రావు బయోపిక్లో నాగార్జున: నాగ సుశీల

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా ప్రముఖ వ్యక్తుల జీవితాలను తెరపై చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. మన తెలుగులో కూడా సీనియర్ ఎన్టీఆర్, మహానటి సావిత్రి వంటి గొప్ప వ్యక్తుల జీవితాలు తెరపై ఆడియన్స్ ను అలరించాయి. ఇక తాజాగా మరో ప్రముఖ వ్యక్తి యొక్క బయోపిక్ తెరపైకి వచ్చింది. ఆ మహా నటుడు మరెవరో కాదు అక్కినేని నాగేశ్వర రావు. 

ఈ విషయంపై తాజాగా ఆయన కూతురు నాగ సుశీల స్పందించారు. ఇటీవలే ఆమె మహా మ్యాక్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ తండ్రి నాగేశ్వర రావు చాలా విషయాలు చెప్పుకొచ్చారు. పెళ్లైన కొత్తలో నాన్నకి చాలా కోపం ఉండేదట. అమ్మ చెప్పేది కానీ.. మాకు ఊహ తెలిసిన తరువాత నుండి ఆయన కోపంగా ఉండటం ఒక్కసారి కూడా చూడలేదు. అందరితో సరదాగా ఉండేవారు. మరీ ముఖ్యంగా ఆయన మానవులు మానవరాళ్లతో.

మాకు సమ్మర్ హాలిడేస్ లో నాన్నగారి షూటింగులకు వెళ్లేవాళ్లం. ఎక్కువగా ఊటీలో షూటింగ్స్ జరిగేవి. ఇక నాన్నగారి సినిమాలు నేను చూసేదాన్ని కాదు ఎందుకంటే.. ఆయనని ఎవరైనా కొడుతుంటే చూడలేకపోయేదాన్నీ. నాన్న బయోపిక్ గురించి నా దగ్గర ఎవరూ ప్రస్తావించలేదు కానీ.. ఒకవేళ చేస్తే నాన్నగారి పాత్రని నాగార్జున చేస్తేనే బాగుంటుంది.. అంటూ తన అభిప్రాయాన్ని  చెప్పుకొచ్చారు నాగ సుశీల. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.