Tillu Square Box Office: ఐపీఎల్ నడుస్తున్న ఏంపర్లేదు..టిల్లూ స్క్వేర్‌కు రూ.100 కోట్లు పక్కా: ప్రొడ్యూసర్ నాగ వంశీ

Tillu Square Box Office: ఐపీఎల్ నడుస్తున్న ఏంపర్లేదు..టిల్లూ స్క్వేర్‌కు రూ.100 కోట్లు పక్కా: ప్రొడ్యూసర్ నాగ వంశీ

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Soddu Jonnalagadda) హీరోగా వచ్చిన డీజే టిల్లు(DJ Tillu) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు విమల్ కృష్ణ(Vimal krishna)తెరకెక్కించిన ఈ టిపికల్ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఇక డీజే టిల్లుగా సిద్దు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఇప్పుడు ఆ హంగామాను రెట్టింపు చేస్తూ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ముందు నుంచి మంచి అంచనాలు కూడా ఉండటంతో పాటు ఇవాళ రిలీజయ్యాక పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి దీంతో ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది. మేకర్స్ అనుకున్నట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరిగాయి. 

ఈ క్రమంలో టిల్లు స్క్వేర్ మూవీ ప్రొడ్యూసర్ అయిన నాగ వంశీ తాజాగా జరిపిన సక్సెస్ మీట్ లో క్రేజీ కామెంట్స్ చేశాడు. "టిల్లూ స్క్వేర్ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఖచ్చితంగా సాధిస్తుందని చాలా నమ్మకంగా చెబుతున్నాడు. అంతేకాదు, ప్రస్తుతం ఎక్కడ చూసిన ఐపీఎల్ ప్రభావం కూడా ఉండటంతో..ఈ సినిమా కలెక్షన్స్ పై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందని వస్తున్న కామెంట్స్ పై..ఆయన స్పందిస్తూ..తమ సినిమాపై ఎలాంటి ఉండదని స్పష్టం చేశాడు.

ఈ సినిమా 'ఫస్ట్ డే రూ.25 కోట్ల గ్రాస్ అంచనా వేస్తున్నాం. యూఎస్ఏ ప్రీమియర్స్ గ్రాస్ 5 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక నైజాం ఏరియాలో ఈ సినిమాకు రూ.7 నుంచి 8 కోట్లు రావచ్చునే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే టిల్లు స్క్వేర్ కి ప్రతి చోటా సాధ్యమైనన్ని ఎక్కువ షోలను యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. థియేటర్ రన్ ముగిసే సమయానికి రూ.100 కోట్ల గ్రాస్ అంచనా వేస్తున్నాం.

మ్యాట్నీ షోలకు డిమాండ్ పెరగడం రానున్న రోజుల్లో మూవీ ఎలా ఆడబోతోందో స్పష్టం చేస్తోంది. ఈ సమ్మర్ లో పెద్దగా రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ఏమీ లేవు. అంతేకాదు ఉగాది, రంజాన్ లాంటి ఫెస్టివల్స్ కూడా ఉండటంతో మాకు బాగా కలిసి వస్తాయని" ఆశాభావం వ్యక్తం చేశారు