బన్నీ రోల్ ఇదే: త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ.. నిర్మాత నాగ వంశీ కీలక అప్డేట్!

బన్నీ రోల్ ఇదే:  త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ.. నిర్మాత నాగ వంశీ కీలక అప్డేట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-డైరెక్టర్ త్రివిక్రమ్తో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో త్రివిక్రమ్‌ కథను సెట్ చేసినట్లు ఇటీవలే నిర్మాత నాగవంశీ రివీల్ చేసాడు. లేటెస్ట్గా నాగవంశీ.. ఈ మూవీపై మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ 'సోషియో ఫాంటసీ కాకుండా ఇది పూర్తిగా మైథలాజికల్‌ జానర్‌ అని నాగవంశీ కన్ఫార్మ్ చేశారు. రామాయణం మరియు మహాభారతం మాదిరిగా కాకుండా పురాణాల ఆధారంగానే అన్ని సన్నివేశాలు ఉంటాయన్నారు. అక్టోబర్‌ నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుందని, ఈ సినిమా చూసి యావత్ దేశమంతా ఆశ్చర్యానికి గురవుతుందని నాగవంశీ స్పష్టం చేశారు.

ALSO READ | దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండి: మీడియాకు ప్రొడ్యూసర్ నాగవంశీ సవాల్

అయితే, ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్ర కుమారస్వామి క్యారెక్టర్ ను బేస్ చేసుకుని ఉంటుందని,ఇప్పటికే కొన్ని కథనాలు వచ్చాయి.  ఇక తాజాగా నాగవంశీ కూడా మైథలాజికల్‌ జానర్‌ అని చెప్పడంతో అల్లు అర్జున్ రోల్ ఇదేనంటూ ఫ్యాన్స్ ఓ క్లారిటీకి వచ్చేశారు. అంతేకాకుండా బన్నీ, కుమారస్వామిగా ఉన్న జీబ్లీ ఇమేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం నాగవంశీ తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ మూవీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడు.  కింగ్డమ్ మే నెలలో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై కూడా నాగవంశీ స్పందిస్తూ.. ‘కేజీయఫ్‌’ స్థాయిలో కింగ్డమ్ మూవీ  ఉండబోతుందని, గౌతమ్ తన మేకింగ్ తో అన్నీ ప్రశ్నలకి సమాధానం ఇచ్చేలా ఉంటుందని నాగవంశీ తెలిపాడు.