ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు : ముందుగా ప్రకటించేసిన పవన్ కల్యాణ్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు : ముందుగా ప్రకటించేసిన పవన్ కల్యాణ్

ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్.. ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్ వేస్తారా లేదా అనే ఉత్కంఠ మధ్య.. కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల క్రమంలో వచ్చిన డౌట్స్ కు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఊహించని షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున అన్నయ్య నాగబాబుకు లైన్ క్లియర్ చేసేస్తూ ప్రకటించేశారు. 

ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా.. జనసేన అభ్యర్థిగా  నాగబాబు పేరును జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు  సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని  నాగబాబుకి సమాచారం ఇచ్చిన పవన్ కళ్యాణ్ . నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని ఆదేశించిన పవన్ కళ్యాణ్. అంటూ ఆ పార్టీ అధికారికంగా ప్రకటించేసింది. 

Also Read : చంద్రబాబు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు

జనసేన పార్టీ నుంచి వచ్చిన ఈ అధికారిక ప్రకటనతో టీడీపీ షాక్ అయ్యింది. ఎందుకంటే టీడీపీ అనుకూల పత్రికల్లో కార్పొరేషన్ చైర్మన్ గా నాగబాబు, రాజ్యసభకు వెళ్లనున్న నాగబాబు అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తో కథనాలు వచ్చాయి. ఇవి చూసి అందరూ నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి రావటం లేదో ఏమో అని అనుకున్నారు.. తీరా మధ్యాహ్నానికి సీన్ మారిపోయింది.. టీడీపీ ఊహించని విధంగా పవన్ కల్యాణ్ స్వయంగా నాగబాబు పేరును ఖరారు చేయటం.. ఆయన నామినేషన్ వేయాలని ఆదేశించటం చకచకా జరిగిపోయాయి. దీంతో కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది.