Mythical Thriller: నాగచైతన్య-కార్తీక్ దండు మూవీ.. విరూపాక్ష తరహాలోనే టైటిల్ ఫిక్స్!

Mythical Thriller: నాగచైతన్య-కార్తీక్ దండు మూవీ.. విరూపాక్ష తరహాలోనే టైటిల్ ఫిక్స్!

అక్కినేని నాగచైతన్య (Nagachaithanya) తండేల్ సక్సెస్తో మంచి జోష్ మీదున్నాడు. ఇదే సక్సెస్ను కొనసాగించేలా ఇపుడు తన నెక్స్ట్ మూవీ (NC24)కోసం రంగంలోకి దిగాడు. విరూపాక్ష మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన కార్తిక్​ దండు (Karthik Dandu) డైరెక్షన్లో చై ఓ సినిమా చేస్తున్నాడు.

మైథికల్ థ్రిల్లర్గా రానున్న ఈ ప్రాజెక్ట్ (NC24)అనౌన్స్ మెంట్ 2024 చివర్లో వచ్చింది. అయితే, ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఈ సినిమాలో నాగచైతన్యకి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సమాచారం. ముందుగా పూజా హెగ్డే పేరు వినిపించింది. ఈ క్రమంలో చై కోసం మీనాక్షిని దింపినట్లు టాక్. అలాగే, NC24 వర్కింగ్ టైటిల్తో రానున్న ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారట. విరూపాక్ష టైటిల్ తరహాలోనే చైతన్య మూవీకి ఆసక్తి కలిగించేలా పేరు ఫిక్స్ చేశారట.

NC24 మూవీకి ‘వృష‌క‌ర్మ‌’ (VrushaKarma) అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సైమా X అకౌంట్లో పెట్టిన పోస్ట్తో, టైటిల్ కన్ఫార్మ్గా ఇదే అయ్యుంటుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. త్వరలో మేకర్స్ నుంచి టైటిల్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వృష‌క‌ర్మ‌ అంటే కార్యసాధకుడు, చేసే పనిపై శ్రద్ధ ఉన్నవాడు అని అర్థం.

ఈ మైథలాజికల్ థ్రిల్లర్లో చైతూ ద్విపాత్రాభినయం చేయనున్నారట. కనిపించే రెండు పాత్రలకు చాలా వేరియేషన్స్ ఉంటాయని, ముఖ్యంగా చైతూ ఇందులో తన కొత్త లుక్​తో అదరగొడుతారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతుంది. త్వరలో షూటింగ్ షురూ కానుంది.

డైరెక్టర్ కార్తీక్ దండు విజన్పై విరూపాక్ష మూవీతో ప్రతిఒక్కరికీ తెలిసింది. ఇక చైతో ఒక గట్టి హిట్ కొట్టేయండి బాస్.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీకు సుకుమార్ స్టోరీ అందిస్తుండగా.. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.