దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. ఈ మూవీ నుంచి నగాదారిలో లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది. నిప్పు ఉంది, నీరు ఉంది నగాదారిలో.. చివరికి నెగ్గేదేది, తగ్గేదేది నగాదారిలో అంటూ సాగే పాట సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇంతదాక పుట్టలేదుగా ప్రేమకన్నా గొప్ప విప్లవం..అంటూ సాగే చరణం..ఆలోచనను రేకెత్తిస్తుంది. అడవిలో రానా - సాయి పల్లవిల ప్రయాణాన్ని సాంగ్లో చూపించారు. ఈ సాంగ్కు ద్యావరి నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ సాహిత్యాన్ని అందించగా..బొబ్బిలి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్. సింగర్ వరం పాటను అద్భుతంగా ఆలపించారు.
విరాటపర్వం సినిమా జూన్ 17న విడుదల కానుంది. ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం బ్యాక్ డ్రాప్లో విరాట పర్వాన్ని తెరకెక్కించారు. రానా .. కామ్రేడ్ రవన్నగా నటించాడు. అతని రచనలను ప్రేమించే యువతి వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. వీరితో పాటు ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, కోలు కోలు సాంగ్, వాయిస్ ఆఫ్ రవన్న గ్లింప్స్, సోల్ ఆఫ్ వెన్నెలకు ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ లభించింది.