
నారాయణ్ ఖేడ్,వెలుగు: సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండల జడ్పీటీసీ రాజు రాథోడ్ మంగళవారం బీజేపీలో చేరారు. జహీరాబాద్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ బీబీ పాటిల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజు రాథోడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, నాయకులు పాల్గొన్నారు.