స్టాఫ్​ లేకుండానే మెడికల్​ కాలేజీలా?

స్టాఫ్​ లేకుండానే మెడికల్​ కాలేజీలా?

నాగర్​ కర్నూల్​, వెలుగు : మెడికల్​ కాలేజీల్లో స్టాఫ్​ 50 మంది ఉండాల్సింది కేవలం ఐదారు గురితో నెట్టుకొస్తున్నారని మాజీ మంత్రి నాగం జనార్ధన్​ రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్​ కాలేజీలను ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్​ రావు ఊదరగొడుతున్నారని, కానీ సరైన స్టాఫ్​ ను మాత్రం నియమించడం లేదన్నారు. 

మెడికల్​కాలేజీల్లో ప్రొఫెసర్లు,అసిస్టెంట్​ ప్రొఫెసర్లు,హెచ్​ఓడీలను నియమించకుండా.. కమీషన్ల కోసం బిల్డింగులు కడుతున్నారని ఎద్దేవా చేశారు. లోపాలను ఎత్తిచూపితే.. బీఆర్​ఎస్​ మంత్రులు చివరికి గవర్నర్​ను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. ఈ సమావేశంలో శశిధర్​ రెడ్డి, రవి, బాలాగౌడ్​ ఉన్నారు.