హైకోర్టులో నాగర్కర్నూల్ ఎమ్మెల్యేకు ఊరట.. నాగం పిటిషన్ కొట్టివేత

హైకోర్టులో నాగర్కర్నూల్ ఎమ్మెల్యేకు ఊరట.. నాగం పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్ : నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. మర్రి జనార్ధన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలంటూ నాగం జనార్ధన్ రెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2019లో నాగం జనార్ధన్ రెడ్డి వేసిన పిటిషన్ పై న్యాయస్థానం సోమవారం (ఆగస్టు 14న) తీర్పు వెల్లడించింది. 2018 ఎన్నికల్లో నాగం జనార్ధన్ రెడ్డిపై మర్రి జనార్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ లో కొన్ని వివరాలు దాచి పెట్టారని నాగం జనార్ధన్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది న్యాయస్థానం. ఆరోపణలకు తగిన ఆధారాలు పిటిషన్ లో చూపలేదని పిటిషన్ కొట్టివేసింది.