ఎలక్షన్ టైం దగ్గరపడేకొద్దీ కొత్త కొత్త ఆలోచనలతో లీడర్లు రెడీ అవుతున్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే, వ్యాపారవేత్త మర్రి జనార్దన్ రెడ్డి గురించి కూడా లోకల్ పార్టీలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన జనార్దన్ రెడ్డి ఈసారి కొత్త ఐడియాలో ఉన్నట్లు చెబుతున్నారు. తనకు బదులు తన భార్య జమునారాణిని అసెంబ్లీ బరిలోకి దించే ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సీటు వదులుకొని ఆయనేం చేస్తారంటే.. దానికీ క్లారిటీ ఉందని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి సీటు బరిలో దిగే ఇంట్రెస్ట్ తో ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త ఐడియాతో ఇప్పటికే చాలా ప్లానింగ్ చేసుకున్నారని మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు అంటున్నారు. బిజినెస్ మ్యాన్ గా పార్టీ కార్యక్రమాలకు స్పాన్సర్ గా ఉన్న తన ఇంట్రెస్ట్ ను పార్టీ కాదనదనే నమ్మకంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్రెస్ట్ ఎట్లా ఉన్నా అందులో ఇంకో ట్విస్ట్ ఏమవుతుందో చూడాలని పార్టీ లీడర్లలో టాక్ నడుస్తోంది. మర్రికి బాగా దగ్గర మనిషి అయిన జక్క రఘునందన్ రెడ్డి ముందు నుంచే పాలిటిక్స్ లో ఉన్నారు. తన పొలిటికల్ కెరీర్ వదిలి దోస్తు కోసమే పని చేశారని అనుచరులు చెప్పుకుంటారు. ఈసారైనా బరిలో లేకుంటే రాజకీయంగా ఇంకా ఫ్యూచర్ ఉండదన్న ఆందోళన జక్క అనుచరుల్లో ఉంది. ఈ ఇష్యూనే ఇద్దరు దోస్తుల మధ్య గ్యాప్ కు కారణమైందన్న చర్చ జరుగుతోంది. ఇద్దరూ కలిసే ఉన్నట్లు కనిపిస్తున్నా మునుపటి దగ్గరితనం లేదంటున్నారు.
ఇప్పుడేం జరుగుతుందన్నదే ఎవరికీ అంతు బట్టడం లేదు. మర్రి తన భార్యకు టికెట్ తెచ్చుకుంటారా? అదే జరిగితే దోస్తు మాటేంటి..? ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుందన్నది పార్టీ లీడర్లకే సస్పెన్స్ గా మారింది. లోకల్ గా మాత్రం రాజకీయం ఎంత పనిచేసిందని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు మర్రి ప్లాన్ వర్కవుట్ అయితే అదే లైన్లో రెండో టికెట్ కు ప్లానింగ్ చేసుకోవాలని జిల్లాలోనే మరికొందరు లీడర్లు కాచుకొని ఉన్నారంట.