- కుమారుడు భరత్ తో కలిసి చేరిక!
- భరత్ కు నాగర్ కర్నూల్ టికెట్?
- కాంగ్రెస్ క్యాండిడేట్ గా మల్లు రవి ఎంట్రీతో మారిన సీన్
- ఎల్లుండి కమలం గూటికి చేరే చాన్స్
హైదరాబాద్: నాగర్ కర్నూల్ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు రాములు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. కొంత కాలంగా పార్టీ అధినాయకత్వం పట్ల రాములు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ సమావేశాలకూ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ మేరకు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆయన అడుగులు బీజేపీ వైపు పడుతుండటం గమనార్హం. తన కుమారుడు భరత్ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం.
ALSO READ :- రాజాసింగ్ నహీ హై!
నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆశిస్తున్నారు. ఈ మేరకు ఆయన సలహాదారు పదవికి కూడా రాజీనామా చేశారు. తాను నాగర్ కర్నూల్ నుంచి బరిలోకి దిగబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. కాంగ్రెస్ లో దారులు మూసుకుపోవడంతో ఆయన బీజేపీ వైపు అడుగులు వేసినట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ ఎంపీ బరిలో రాములు కుమారుడు భరత్ బీజేపీ తరఫున బరిలోకి దిగుతారని తెలుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ నాయకులు సైతం రాములు చేరికను ధ్రువీకరించారు. అయితే ఎంపీ రాములు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.