- హర్యానా ఎన్నికల ఫలితాలపై నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
హైదరాబాద్, వెలుగు : హర్యానా ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలున్నాయని, వీటిపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సమగ్ర వివరణ ఇవ్వాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరిగిన వెంటనే బీజేపీ విజయం సాధించిందని..
ఈవీఎంల పనితీరుపై అనుమానాలున్నాయని చెప్పారు. కాంగ్రెస్ విజయం సాధించిన నియోజకవర్గాల్లో ఈవీఎంలో 65 శాతం ఛార్జింగ్ ఉన్నదని, బీజేపీ గెలిచిన నియోజక వర్గాల్లో ఛార్జింగ్ 99 శాతం ఉందని ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై ఈసీ నుంచి సమగ్ర వివరణను కోరుతున్నామని పేర్కొన్నారు.