ప్రజా పాలన దినోత్సవానికి ఎందుకు రారు?

ప్రజా పాలన దినోత్సవానికి ఎందుకు రారు?
  • బీజేపీ నేతలకు ​ఎంపీ మల్లు రవి ప్రశ్న

హైదరాబాద్​, వెలుగు :  భారత్ లో హైదరాబాద్ స్టేట్ 1948, సెప్టెబర్ 17న విలీనమైందని, ఆ రోజున రాజుల పాలన పోయి ప్రజా పాలన మొదలైందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన దినోత్సవానికి హాజరుకావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు సీఎం రేవంత్ లేఖ రాశారని.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కూడా హాజరు కావాలని కోరారని పేర్కొన్నారు.

ప్రజా పాలన దినోత్సవంలో బీజేపీ నేతలెవరు పాల్గొనబోరని కిషన్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సెప్టెంబర్ 17ను గుర్తించలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ కంచెను తొలగించి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారన్నారు.