అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్.. పెళ్లి కూతురు ఎవరంటే..!

అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్.. పెళ్లి కూతురు ఎవరంటే..!

అక్కినేని ఫ్యామిలీ నుంచి శుభవార్త వచ్చింది. ఆసక్తికర వార్త కూడాను.. అఖిల్ అక్కినేని ఎంగేజ్ మెంట్ అయ్యింది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అక్కినేని అఖిల్, బైనాబ్ రావడ్జీ అంటూ ట్విట్ చేశారు. ఈ వార్తతో ఒక్కసారిగా షాక్ అయ్యారు అక్కినేని సినీ అభిమానులు. నిన్నటికి నిన్ననే నాగచైతన్య, శోభిత పెళ్లి వార్త చెప్పిన నాగార్జున.. ఇంతలోనే చిన్న కుమారుడు అఖిల్ ఎంగేజ్ మెంట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించటం విశేషం.

తన  ఎంగేజ్ మెంట్ విషయంలో అఖిల్ కూడా స్పందించాడు. నా కలల రాణి దొరికింది.. జైనాబ్ రావడ్జీ, నేను సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాం అని ప్రకటించటానికి ఆనందంగా ఉంది అంటూ క్యాప్షన్ రాశారు అఖిల్.  2024, డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, శోభిత పెళ్లి జరగనున్న టైంలోనే.. అఖిల్ ఎంగేజ్ మెంట్ విషయం ప్రకటించటం చూస్తుంటే.. అదే పెళ్లి వేడుకలో వీళ్లిద్దరి పెళ్లి కూడా జరుగుతుందా అనే వార్త చక్కర్లు కొడుతుంది.

ALSO READ | Samantha: విడాకుల తర్వాత ఎన్నెన్ని మాటలు అన్నారు.. అయినా కానీ.. : సమంత ఎమోషనల్

ఇక అక్కినేని అఖిల్ విషయానికి వస్తే.. 2017లోనే శ్రియా భూపాల్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. పెళ్లి వరకు వెళ్లింది. అనూహ్య కారణాలతో ఆ పెళ్లి ఆగిపోయింది. శ్రియా భూపాల్, అఖిల్ పెళ్లి విషయంలో అప్పట్లో చాలా చర్చలు కూడా జరిగాయి. వాళ్లిద్దరి మధ్య జరిగిన గొడవ వల్లే విడిపోయినట్లు ప్రచారం జరిగింది. ఇటలీలో పెళ్లి ప్లాన్ చేసుకున్న తర్వాత.. అఖిల్ పెళ్లి రద్దు కావటం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఆ తర్వాత అఖిల్ సినిమాలపై దృష్టి పెట్టగా.. శ్రియా భూపాల్ తన ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్లిపోయారు. మళ్లీ ఏడేళ్ల తర్వాత అఖిల్ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. ప్రస్తుతం అఖిల్ వయస్సు 30 ఏళ్లు..