Nagarjuna: రోజుకు రూ.10 వేలు ఖర్చు చేస్తున్న హీరో నాగార్జున.. అందుకే ఈ వయసులో కూడా అలా..

Nagarjuna: రోజుకు రూ.10 వేలు ఖర్చు చేస్తున్న హీరో నాగార్జున.. అందుకే ఈ వయసులో కూడా అలా..

టాలీవుడ్ లో 6 పదుల వయసు పైబడినా యంగ్ గా కనిపిస్తూ అలరిస్తున్నాడు స్టార్ హీరో కింగ్ నాగార్జున. స్వర్గీయ నటుడు అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా పరిచయమైన నాగార్జున ఇప్పటికీ యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. అయితే నాగార్జున ఈ ఏజ్ లో కూడా ఇంత యంగ్ గా కనిపిస్తూ ఫిట్ గా ఉండటానికి కారణం ఫుడ్ డైట్ అండ్ ఫిట్నెస్ వర్కౌట్స్ అని తెలుస్తోంది. అయితే నాగార్జున వీటికోసం నెలకి దాదాపుగా రూ.3 లక్షలకంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. 

నాగార్జున డైలీ డైటీషన్స్ సూచించిన ఆహారాన్ని తీసుకుంటాడు. ఇందులో తనకి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఇలా ప్రతీది సమపాళ్లలో తీసుకుంటూ డైట్ పాటిస్తాడు. అలాగే ఉదయం లేవగానే క్రమం తప్పకుండా జిమ్ వర్కౌట్లు, యోగా వంటివి చేస్తాడు. దీంతో నాగార్జున కేర్ టేకర్స్ జీతాలు, ఫుడ్ ఐటమ్స్ ఇలా అన్నీ కలిపి రోజుకి దాదాపుగా రూ.10 వేలకంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అయితే డబ్బుకంటే హెల్త్ చాలా ముఖ్యమని నాగార్జున బలంగా నమ్ముతున్నాడు. అందుకే ఫుడ్ అండ్ డైలీ లైఫ్ స్టైల్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా లైఫ్ లీడ్ చేస్తున్నాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగార్జున తెలుగులో కుబేర, కూలీ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే కుబేర మల్టీ స్టారర్ కాగా కూలీ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. కుబేర సినిమాలో ధనుష్ కూడా లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది.