శివుడి భక్తుడిగా ధనుష్.. నాగార్జున కుబేర వచ్చేది అప్పుడేనా.?

శివుడి భక్తుడిగా ధనుష్..  నాగార్జున కుబేర వచ్చేది అప్పుడేనా.?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా "కుబేర". ఈ సినిమా ని తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళం తదితర భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కలసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ధనుష్ కి జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందాన నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని డబ్బు, ఆస్తి, తలరాత ఆసక్తికర అంశాలతో తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల.

శివరాత్రి పండగ సందర్భంగా చిత్ర యూనిట్ కుబేర సినిమా రిలీజ్ అప్డేట్స్ ఇచ్చారు. ఇందులోభాగంగా ఈ సినిమాని జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అలాగే కుబేర సినిమా పోస్టర్స్ కూడా షేర్ చేశారు. ఈ పోస్టర్స్ లో హీరో ధనుష్, నాగార్జున డీసెంట్ లుక్ లో కనిపించారు. ఆమధ్య ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో హీరో నాగార్జున చేసిన మల్టీస్టారర్స్ దాదాపుగా హిట్ అయ్యాయి. దీంతో కుబేర కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా తర్వాత దాదాపుగా 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని మరో మంచి స్టోరీతోప్ ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమవుతున్నాడు. అలాగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ జోనర్ కాకుండా ఈసారి డిఫరెంట్ జోనర్ ని ఎంచుకోవడంతో కుబేర సినిమా కోసం శేఖర్ కమ్ముల ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.