చిరంజీవికి అక్కినేని అవార్డ్

చిరంజీవికి అక్కినేని అవార్డ్

అక్కినేని నాగేశ్వరరావు  శత జయంతి వేడుకలను శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా  ‘ఏఎన్ఆర్ 100 కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ పేరుతో  ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా కలిసి  ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని నిర్వహిస్తున్నారు.  ఏఎన్ఆర్ ఐకానిక్ ఫిలిం ‘దేవదాసు’ స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా  అక్కినేని పోస్టల్ స్టాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న  నాగార్జున మాట్లాడుతూ ‘ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ 100  ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 31 సిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.

నాన్నగారి మాస్టర్ పీస్ మూవీస్ ప్రింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అద్భుతంగా ఉన్నాయి. ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఇది వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ ఇస్తుంది. ప్రతి రెండేళ్ళకు ఏఎన్ఆర్ అవార్డ్ ఇస్తున్నాం. ఈ ఏడాది అవార్డ్ చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే.. శత జయంతి ఏడాదిలో ఈ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చిరంజీవి గారు  ఎమోషనల్ అయ్యారు.

అక్టోబర్ 28న అమితాబ్ బచ్చన్ గారు ఈ అవార్డును అందజేస్తారు’ అని తెలిపారు. ఏఎన్నార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాసిక్స్ అయిన దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యా భర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమ్‌‌‌‌నగర్, ప్రేమాభిషేకం, మనం సినిమాలను 4కెలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందని నిర్వాహకులు అన్నారు. అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు దర్శకుడు కె రాఘవేంద్రరావు,  మురళీ మోహన్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.