
న్యూడిల్లీ: ఆయుర్వేద ప్రొడక్టుల కంపెనీ డాబర్ తన ఓరల్ కేర్ బ్రాండ్ డాబర్ మిస్వాక్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు అక్కినేని నాగార్జునను నియమించుకుంది. మిస్వాక్ 70కిపైగా నోటి సంరక్షణ ప్రయోజనాలను అందిస్తుందని తెలిపింది. దంతాలను, చిగుళ్లను సంరక్షిస్తుందని పేర్కొంది. నాగార్జునతో చిత్రీకరించిన యాడ్ త్వరలోనే టెలివిజన్ స్క్రీన్‌లపైకి వస్తుందని పేర్కొంది.