నాగ్ సార్ మీ డ్యాన్స్ రగడ్ ఫయింగ్.. సెన్సేషనల్ 'రా మచ్చా'తో కుమ్మేసారు: తమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

నాగ్ సార్ మీ డ్యాన్స్ రగడ్ ఫయింగ్.. సెన్సేషనల్ 'రా మచ్చా'తో కుమ్మేసారు: తమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

రామ్ చ‌ర‌ణ్ (RamCharan) ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌గా తెర‌కెక్కిన..'రా మచ్చా మచ్చా' (Raa Macha Macha) సాంగ్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. ఈ సాంగ్లో ఇంటెన్స్ డ్యాన్స్ వైబ్స్తో చరణ్ దుమ్ములేపేశాడు. గ్రేస్‌తో చెర్రీ వేసిన హుక్ స్టెప్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. వరల్డ్ వైడ్గా ఉన్న సినిమా ఫ్యాన్స్ ఇపుడు చెర్రీ స్టెప్స్ను తమదైన శైలిలో అనుకరిస్తూ చేస్తున్న వీడియోస్ వైరల్ అవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో కింగ్ నాగ్ బిగ్ బాస్ తెలుగు సీజన్లో రా మచ్చా మచ్చాసాంగ్కు కాలుకదిపి ఆడియన్స్లో హుషారు పెంచారు. మొన్న ఎన్టీఆర్ ఆయుధ పూజా సాంగ్కి స్టెప్పులు వేసి అలరించిన నాగ్.. లేటెస్ట్గా గేమ్ ఛేంజర్ 'రా మచ్చా మచ్చా'తో దుమ్ములేపేసాడు.

ఈ పాటకు స్టైలిష్ మాస్ ఎంట్రీతో నాగార్జున చేసిన డ్యాన్స్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని ఓ నెటిజన్ షేర్ చేయగా.. దీనికి గేమ్ ఛేంజర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్విట్టర్ X ద్వారా రియాక్ట్ అయ్యారు. "నాగ్....సార్ సెన్సేషనల్ 'రా మచ్చా మచ్చా' కోసం మీరు చేసిన డ్యాన్స్..రగడ్ ఫయింగ్"  అంటూ రిప్లై ఇచ్చారు. ఏదేమైనా నాగ్ లుక్, ఆ డ్యాన్స్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!మీరు కూడా చూసేయండి.

రా మచ్చా మచ్చా పాట ప్రత్యేకతలు:

రచయిత అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను..నకాష్ అజీజ్ పాడారు. స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేయడం మరో విశేషం. ఎంతో కలర్ ఫుల్గా, గ్రాండియర్ గా ఉన్న ఈ పాటలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే, ఈ పాటలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 

ఈ పాట‌లో ఏకంగా 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్న‌త్వానికి ఏక‌త్వమైన మ‌న దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు ఇందులో భాగ‌మ‌వ‌టం విశేషంగా ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంస్కృతుల‌ను బేస్ చేసుకుని ఈ పాట‌ను శంక‌ర్ వినూత్నంగా రూపొందించారు.

ఏపీలోని విభిన్నమైన నృత్య రీతులలో ఎంతో గుర్తింపు పొందిన 'గుసాడి, కొమ్ము కోయ‌, త‌ప్పెట గుళ్లు' వంటి జాన‌ప‌ద నృత్యాల‌తో పాటు వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రాన‌ప్ప‌, పైకా, దురువ వంటి వాటితో పాటు క‌ర్ణాట‌కు చెందిన హ‌లారి, ఒక్క‌లిగ‌, గొర‌వ‌ర‌, కుణిత వంటి నృత్య రీతుల‌ను కూడా ఈ సాంగ్‌లో మమేకం చేశారు.

  • Beta
Beta feature