టీడీపీ ఆఫీస్లో నాగార్జున.. నంద్యాల ఎంపీతో నాగ్ ఫ్యామిలీ ఫొటో.. అసలు విషయం ఏంటంటే..

టీడీపీ ఆఫీస్లో నాగార్జున.. నంద్యాల ఎంపీతో నాగ్ ఫ్యామిలీ ఫొటో.. అసలు విషయం ఏంటంటే..

సినీ నటుడు నాగార్జున పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడా..? ఏపీలో అధికార కూటమికి దగ్గరవుతున్నాడా..? నంద్యాల టీడీపీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని ఢిల్లీ టీడీపీ ఆఫీస్లో కుటుంబ సమేతంగా నాగార్జున ఎందుకు కలిశాడు..? గతంలో జగన్తో సన్నిహితంగా ఉన్న నాగార్జున టీడీపీ ఎంపీని.. టీడీపీ ఆఫీస్లో కలిస్తే ఏపీ పాలిటిక్స్లో చర్చ జరగకుండా ఉంటుందా..?

ఇవీ నాగార్జున కుటుంబం నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరితో ఫొటో దిగడం, ఆ ఫొటోను నంద్యాల ఎంపీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చ జరిగిన ప్రశ్నలు. అయితే.. ఈ భేటీలో రాజకీయానికి తావు లేదని తెలిసింది. భారతీయ చలనచిత్ర రంగానికి అక్కినేని నాగేశ్వరరావు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనపై ఢిల్లీలో బుక్ లాంచ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత ఢిల్లీ వెళ్లారు.

ఈ సందర్భంలోనే ‘మన్ కీ బాత్’లో అక్కినేని నాగేశ్వరరావును కొనియాడిన ప్రధాని నరేంద్ర మోదీని కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలపాలని నాగార్జున నిర్ణయించుకున్నాడు. అయితే.. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ప్రధాని మోదీని కలిసేందుకు ఆయన పార్లమెంట్కు వెళ్లారు. ప్రధాని మోదీతో భేటీ అయి ధన్యవాదాలు తెలిపారు.

అలా వెళ్లిన నాగార్జున నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరితో కూడా భేటీ అయి ఫొటోకు ఫోజిచ్చారు. ఇదీ.. ఈ ఫొటో వెనుక ఉన్న అసలు విషయం. అంతేతప్ప నాగార్జున రాజకీయాల్లోకి రావడం లేదు. తెలుగుదేశంలో చేరే ఆలోచనలో లేడు. ఈ విషయం తెలియని వైసీపీ, టీడీపీ కేడర్ బైరెడ్డి శబరి పోస్ట్ చేసిన ఫొటో కింద కామెంట్స్ సెక్షన్లో నాగార్జున గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.