లింగాల, వెలుగు : రైతులు వరి కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి సూచించారు. గురువారం అంబటిపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో లింగాలలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార సంఘం కార్యాలలయ అసిస్టెంట్ రిజిస్టర్ రవి కుమార్, సినియర్ ఇన్స్పెక్టర్ నారాయణ తో కలసి ప్రారంభించారు.
రైతులు మధ్యవర్తులను, దళారులకు సంప్రదించవద్దని, ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే.. అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తేమశాతం 17 శాతం లోపు ఉండాలని కనీస మద్దతు ధర క్వింటాల్ కు ఏ గ్రేడ్ రకానికి రు.2203 పొందాలన్నారు. సాధారణ రకానికి రు.2183 చెల్లిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ మానస, పీఎసీఎస్ సీఈఓ పాండు తదితరులు పాల్గొన్నారు.