అన్నపూర్ణ స్టూడియోస్​కు 50 ఏళ్లు

అన్నపూర్ణ స్టూడియోస్​ను అక్కినేని నాగేశ్వర రావు ప్రారంభించి యాభై ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున..  స్టూడియోతో తన అనుబంధం గురించి ప్రత్యేకంగా ముచ్చటించారు.  ‘రోడ్లే లేని రోజుల్లో నాన్నగారు ఇక్కడికివచ్చి ఇంతపెద్ద స్టూడియోను ఎలా స్థాపించారో ఇప్పటికీ నాకు అర్ధం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు. ఎంతో మంది టెక్నీషియన్స్, కొత్త నటీనటులు, కొత్త దర్శకులకు ఇది ఉపాధి కల్పించింది. అందుకే ఎంతో మందికి ఏయన్నార్‌‌‌‌‌‌‌‌ స్ఫూర్తి.

ప్రతి సక్సెస్ ఫుల్ మ్యాన్ వెనుక ఒక విమెన్ ఉంటారని, తన విజయం వెనుక మా అమ్మగారు ఉందని ఆయన నమ్మారు. అందుకే ఈ స్టూడియోకి ‘అన్నపూర్ణ స్టూడియోస్‌‌‌‌‌‌‌‌’ అని పేరు పెట్టారు.  ఇక్కడకు వచ్చినప్పుడల్లా అమ్మ,  నాన్న ఇక్కడే ఉన్నారనిపిస్తుంది. అన్నపూర్ణ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ని మేము ఫ్యామిలీగా భావిస్తాం. ఇవాళ స్టూడియో కళకళలాడుతోందంటే అది వాళ్లందరి వల్లే.  ప్రతి సంక్రాంతికి అమ్మ, నాన్న అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ ట్రెడిషన్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతోంది. జీవితంలో నాకు, మా పిల్లలకు, మా కుటుంబానికే కాదు సమాజంలో ఎంతోమందికి నాన్న గారు బిగ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పిరేషన్’ అని చెప్పారు.  

ALSO READ | బోల్డ్‌‌‌‌‌‌‌‌ కన్నన్‌‌‌‌‌‌‌‌గా.. విజయ్ సేతుపతి